Prabhas: రెండోసారి కూడా సర్జరీ ఫెయిల్ అయ్యిందా.. కొత్త అనుమానాలు రేపిన ప్రభాస్ లేటెస్ట్ వీడియో!

ప్రభాస్ మార్కెట్ పది రెట్లు పెరగడానికి కారణం ‘బాహుబలి'(సిరీస్). రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా కోసం 5 ఏళ్ళ పాటు కష్టపడ్డాడు ప్రభాస్. ఒళ్ళు హూనం చేసుకుని.. సర్జరీలు మీద సర్జరీలు చేయించుకున్నాడు. మొన్నటికి మొన్న మోకాలు సర్జరీ కూడా చేయించుకుని వచ్చాడు. అన్నీ ఎలా ఉన్నా.. ప్రభాస్ కొన్నాళ్లుగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కోసం విదేశాలకి వెళ్లొస్తున్నాడు. ఆల్రెడీ ఒకసారి చేయించుకోగా అది ఫెయిల్ అయినట్టు వినికిడి. దీంతో కొన్ని తప్పనిసరి ఈవెంట్లకి వెళ్లేప్పుడు విగ్ వాడుతున్నట్టు ఇన్సైడ్ టాక్.

‘సాహో’ టైంలో (Prabhas) ప్రభాస్ కి హెయిర్ ఫాల్ పెరిగినట్టు వినికిడి. దీంతో విగ్ ల పై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వినికిడి. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ప్రభాస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోగా అది ఫెయిల్ అయినట్టు వినికిడి. దీంతో కొన్నాళ్లుగా గ్యాప్ వంటివి పెట్టుకుని కవర్ చేస్తున్నాడు ప్రభాస్. రీసెంట్ గా అంటే ‘ఆదిపురుష్’ రిలీజ్ తర్వాత మరోసారి విదేశాలకి వెళ్లి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించుకోగా..

ఈసారి కూడా సక్సెస్ కాలేదు అని వినికిడి. తాజాగా అతను దశరథ్ నిర్మాణంలో రూపొందిన ‘లవ్ యు రామ్’ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో ప్రభాస్ మరోసారి క్యాప్ లాంటిది పెట్టుకుని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ టాపిక్ మరోసారి చర్చనీయాంశం అయ్యింది. ఇక ప్రభాస్ త్వరలో మొదలుకానున్న ‘సలార్’ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనాలి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus