Prabhas,Hanu Raghavapudi: ప్రభాస్ హను రాఘవపూడి సినిమాలో ఆ లక్కీ బ్యూటీకి ఛాన్స్ దక్కిందా?

  • March 11, 2024 / 06:04 PM IST

ప్రభాస్ (Prabhas) హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తారని తెలుస్తోంది. సీతారామం సినిమాతో మృణాల్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు అనే సంగతి తెలిసిందే. మృణాల్ ను తన సినిమాలో రిపీట్ చేయాలని హను రాఘవపూడి ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

మృణాల్ ఠాకూర్ కు తెలుగులో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సీతారామం సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేయనున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం.

కల్కి (Kalki) పూర్తైన తర్వాత ప్రభాస్ ఈ సినిమాకు డేట్స్ కేటాయిస్తారని తెలుస్తోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. పీఎస్ వినోద్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా విశాల్ భరద్వాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తోంది. సీతారామం (Sita Ramam) సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

హను రాఘవపూడి రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. ప్రభాస్ ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. ప్రభాస్ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సైతం మార్కెట్ ను పెంచుకుంటున్నారు. బాలీవుడ్ హీరోలకు ప్రభాస్ గట్టి పోటీ ఇస్తుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus