Spirit: సందీప్ రెడ్డి వంగా సినిమాలో ప్రభాస్ లుక్ అలా ఉండబోతుందా?

  • June 30, 2024 / 03:44 PM IST

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) సలార్ (Salaar), కల్కి  (Kalki 2898 AD) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవడంతో ప్రభాస్ తర్వాత సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో స్పిరిట్ (Spirit) అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూస్తామని రెబల్ (Rebel) , మిర్చి (Mirchi) తరహా లుక్ లో ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తారని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం ప్రభాస్ మరింత ఫిట్ గా కనిపించనున్నారని భోగట్టా. లుక్ విషయంలో సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కు షరతులు విధించారని తెలుస్తోంది. 30 ఏళ్ల పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించనున్నారని తెలుస్తోంది. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూట్ మొదలుకానుంది. ప్రభాస్ ఇప్పటివరకు పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించలేదు. స్పిరిట్ మూవీ ప్రభాస్ కటౌట్ కు తగ్గ సినిమా అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సందీప్ రెడ్డి వంగా సినిమాలలో గ్రాఫిక్స్ కు కూడా పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కథనంతోనే మ్యాజిక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకత అనే సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దర్శకుల ఎంపికలో సైతం స్టార్ హీరో ప్రభాస్ అదుర్స్ అనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

స్పిరిట్ మూవీ 2026లో థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తైన వెంటనే సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా షూటింగ్ పనులను మొదలుపెట్టనున్నారు. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్ లను ఎంచుకుంటుండగా మరిన్ని భారీ విజయాలు ప్రభాస్ ఖాతాలో చేరితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus