Hema: రేవ్ పార్టీ గురించి మీడియా పై హేమ సెటైర్లు.. వీడియో వైరల్.!

  • June 28, 2024 / 07:08 PM IST

హేమ (Hema) రేవ్ పార్టీ గొడవ అంతా ఇంతా కాదు. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో ఆమె దొరకడం.. తర్వాత పోలీస్ రైడ్ లో దొరకడం.. అందరికీ తెలిసిందే. అయితే ఆ పార్టీతో తనకు సంబంధం లేదు.. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ ఆమె ఓ వీడియో చేసి రిలీజ్ చేసి.. మరిన్ని చిక్కులు కొని తెచ్చుకున్నట్టు అయ్యింది. ఆ వీడియో చూసిన బెంగళూరు పోలీసులు ఆమె ఫోటోని రిలీజ్ చేసి అందరినీ తప్పుదోవ పట్టిస్తుంది అని ప్రూవ్ చేశారు.

అయినా హేమ తగ్గలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను, చికెన్ బిర్యానీ చేస్తున్నాను అంటూ ఆమె మరో వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత ‘ఆమె బెంగళూరులో ఏర్పాటు చేసిన విచారణకు హాజరు కాలేదు ఒంట్లో బాలేదు అంటూ తప్పించుకుంది’ అంటూ మళ్ళీ ఓ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. అటు తర్వాత ఆమెకు బెంగళూరు నార్కోటిక్స్ బ్యూరో మెడికల్ టెస్టులు చేయించి.. అబ్జర్వేషన్ లో పెట్టి ఆమెకు కౌన్సలింగ్ ఇప్పించిన సంగతి తెలిసిందే.

అయితే మొత్తానికి ఆమె ఆ రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసు నుండి బయట పడినట్టు ఉంది. తాజాగా ఆమె తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఆమెను ‘రేవ్ పార్టీ గురించి ప్రశ్నించారు విలేకరులు. ఇందుకు ఆమె ‘ రేవ్ పార్టీ గురించి మీరే చాలా వార్తలు రాశారు కదా. అప్పుడు మీకే తెలియాలి’ అంటూ ఆమె చమత్కరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags