Prabhas: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ముద్దుపేరు ఏంటో మీకు తెలుసా?

  • April 25, 2024 / 04:52 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) తన చుట్టూ ఉండేవాళ్లను ఎంతో ప్రేమగా చూసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ తన సినిమా షూటింగ్ లో పాల్గొనే వాళ్లకు సైతం ఇంటి నుంచి ఫుడ్ అందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని విరాళం అందించే హీరోగా స్టార్ హీరో ప్రభాస్ కు పేరు ఉందనే సంగతి తెలిసిందే. రెమ్యునరేషన్ పరంగా కూడా ప్రభాస్ టాప్ లో ఉన్నారు.

అయితే ప్రభాస్ ను సన్నిహితులు పుబ్సీ (pubsi) అని పిలుస్తారు. అభిమానులు మాత్రం ప్రభాస్ ను మిస్టర్ పర్ఫెక్ట్ అని కూడా పిలుచుకుంటారు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాతో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ లేకపోయినా జులై నెలలోపు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.

కల్కి 2898 ఏడీ యాక్షన్ ప్రేక్షకులకు సైతం నచ్చే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. తాజాగా ఈ సినిమా నుంచి అమితాబ్ పాత్ర అశ్వథ్థామకు సంబంధించిన వీడియో విడుదలైంది. ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్ర పోస్టర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం. త్వరలో కల్కి డేట్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.

కల్కి 2898 ఏడీ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ సినిమా పాన్ ఇండియా భాషలతో పాటు విదేశీ భాషల్లో సైతం విడుదల కానుంది. ప్రభాస్ తర్వాత సినిమాలకు సంబంధించి కూడా త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. ప్రభాస్ భాషతో సంబంధం లేకుండా కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus