Radhe Shyam Release Date: రాధేశ్యామ్ మూవీ రిలీజ్ డేట్ ఇదేనా?

Advertisement

ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే సినిమా రంగానికి చెందిన వాళ్లు సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ సెంటిమెంట్ల వల్లే సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు ఆ మువీ మేకర్స్ ఛత్రపతి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమా 2005 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన రిలీజై సక్సెస్ సాధించింది.

నటుడిగా ప్రభాస్ కు ఛత్రపతి సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. రాధేశ్యామ్ మేకర్స్ సెప్టెంబర్ 30వ తేదీనే రాధేశ్యామ్ మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 22 నుంచి రాధేశ్యామ్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. ఆగష్టు మొదటివారానికి రాధేశ్యామ్ మూవీ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. డార్లింగ్ తరువాత ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్ కావడం గమనార్హం. కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడిన రాధేశ్యామ్ మూవీని సెప్టెంబర్ 30వ తేదీకే రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రాధేశ్యామ్ షూటింగ్ పూర్తైతే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తుండగా కృష్ణంరాజు, భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus