సాధారణంగా స్టార్ హీరోలలో కొంతమంది స్టార్ హీరోలు కథ కంటే రెమ్యునరేషన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చాలామంది భావిస్తారు. అయితే కొందరు హీరోలు మాత్రం ఎంత డబ్బు ఆఫర్ చేసినా కొన్ని పనులు చేయడానికి అస్సలు ఇష్టపడరు. స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ ఏడాది కాలంలో ఏకంగా 150 కోట్ల రూపాయల సంపాదన వచ్చే అవకాశం ఉన్నా వదులుకున్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడంతో పాటు పెద్ద బ్రాండ్లతో కలిసి పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం తమకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ఎండార్స్‌మెంట్‌లపై ఆసక్తి చూపరు. అలా ఎండార్స్‌మెంట్‌లను ఇష్టపడని హీరోలలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఒకరు. ప్రతిష్టాత్మక బ్రాండ్లు ప్రభాస్ కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని తమ బ్రాండ్లను ప్రమోట్ చేయమని కోరుతున్నాయి.
అయితే ప్రభాస్ మాత్రం ఏడాది కాలంలో ఏకంగా 150 కోట్ల రూపాయల బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఆఫర్లను రిజెక్ట్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరో స్టార్ హీరో అయితే ఈ ఆఫర్లను రిజెక్ట్ చేసేవారు కాదు. గతంలో కొన్ని బ్రాండ్ లకు ఆమోదం తెలిపిన ప్రభాస్ కొత్తవాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ప్రభాస్ ను అనేక బ్రాండ్లు సంప్రదిస్తున్నా ప్రభాస్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారా ఎక్కువమొత్తం సంపాదించడం ఇష్టపడటం లేదు.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?