Prabhas: సలార్1 మూవీకి ప్రభాస్ పారితోషికం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • December 21, 2023 / 03:50 PM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. సలార్ సినిమా ఏపీలో ఉదయం 7 గంటల షోలతో మొదలుకానుంది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని బాహుబలి రికార్డ్ లను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్1 సినిమాకు ప్రభాస్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు. పారితోషికంతో పాటు ప్రభాస్ కు లాభాల్లో వాటా దక్కుతోందని సమాచారం అందుతోంది.

అమెరికాలో సలార్ విధ్వంసం కొనసాగుతోంది. ప్రీమియర్స్ తోనే ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించి వార్తల్లో నిలిచింది. ప్రభాస్ హీరోగా, నటుడిగా ఈ సినిమాతో మరో పది మెట్లు ఎదగడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సైతం ఈ సినిమా బుకింగ్స్ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్ గత సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచినా సలార్ మాత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరచదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ అభిమానులకు మరింత దగ్గరవుతారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బెంగళూరులోని ప్రముఖ థియేటర్లలో సలార్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో ఉన్నాయి. డంకీ సినిమాతో పోల్చి చూస్తే సలార్ కు ఎక్కువ సంఖ్యలో స్క్రీన్లు లభిస్తున్నాయి. ఈరోజు అర్ధరాత్రి నుంచి సలార్ షోలు ప్రదర్శితం కానుండగా సలార్ ప్రమోషన్స్ లో భాగంగా (Prabhas) ప్రభాస్, ప్రశాంత్ నీల్ చెప్పిన విషయాలు సైతం సినిమాపై అంచనాలను పెంచేశాయి.

సలార్ ప్రీ రిలీజ్ టాక్ పాజిటివ్ గా ఉంది. ఈ సినిమా నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ స్థాయిని సైతం పెంచడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ మూవీ ఫ్యాన్స్ మళ్లీమళ్లీ చూసేలా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ మూవీ రిలీజవుతోంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus