Salaar Movie: సలార్ కు అమెజాన్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్!

  • June 18, 2021 / 05:22 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా సలార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. KGF అనంతరం దర్శకుడు ప్రశాంత్ నీల్ అత్యంత వేగంగా పూర్తి చేస్తున్న ఈ సినిమాకు ఇటీవల ఒక భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఆ ఆఫర్ ను ఒప్పుకుంటే దాదాపు బడ్జెట్ ను రికవరీ చేసినట్లే.

సలార్ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా సినిమా బిజినెస్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను 150కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తవ్వగా జూలై నెలలో మొత్తంగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమా డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ 130కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ తో పాటు సోని, హాట్ స్టార్ కూడా సలార్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు గాని వాళ్ళు 100కోట్ల దగ్గరే ఆగిపోయారట.

శాటిలైట్ రైట్స్ డీలింగ్ కూడా ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇక సలార్ నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే దాదాపు నిర్మాతలను సెవ్ చేసింది. పైగా కొంత లాభాలు కూడా వస్తాయని చెప్పవచ్చు. ఇక థియేట్రికల్ బిజినెస్ తో బయ్యర్లకు ఈ సినిమా ఎంతవరకు లాభాలను అందిస్తుందో చూడాలి. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus