Salaar: నెట్టింట్లో హాట్ టాపిక్ అయిన ‘సలార్’ లీక్డ్ పిక్.!

  • October 23, 2023 / 11:37 PM IST

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుండీ వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. అయితే ప్రతి సినిమాకి జోనర్ వేరుగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘సాహో’ యాక్షన్ డ్రామాగా వచ్చింది, ‘రాధే శ్యామ్’ ఓ లవ్ స్టోరీ, ‘ఆదిపురుష్’ అనేది మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కింది. ‘ప్రాజెక్ట్ కె’ అనేది టైం ట్రావెల్ కథాంశంతో రూపొందింది. కానీ ప్రభాస్ నుండీ మంచి మాస్ మూవీ ఎప్పుడు వస్తుందా అనే అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అందుకే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’ పైనే అందరి ఆశలు ఉన్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. ‘కె.జి.ఎఫ్’ సిరీస్ కి పని చేసిన టీం ఈ చిత్రానికి కూడా పని చేస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఆల్రెడీ గ్లింప్స్ వచ్చింది.కానీ అది ఆశించిన రేంజ్లో లేదు అనే కామెంట్లు వినిపించాయి. అయితే లీక్డ్ పిక్స్ మాత్రం సినిమా పై బజ్ పెంచుతున్నాయి అని చెప్పాలి.

అదేంటో ప్రభాస్ నటించిన సినిమాల్లో (Salaar) ‘సలార్’ కి వచ్చినన్ని లీక్డ్ పిక్స్ మరో సినిమాకి రాలేదు అనే చెప్పాలి. తాజాగా మరో లీక్డ్ పిక్ వచ్చింది. ఈ పిక్ లో ఓ చేతిలో కత్తి ఇంకో చేతిలో గొడ్డలితో ప్రభాస్ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ లీక్డ్ పిక్ ‘ఛత్రపతి’ రోజులను గుర్తు చేస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus