Salaar: ప్రభాస్ అభిమానులకు ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • June 21, 2023 / 01:28 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘సలార్’ ఒకటి. ప్రభాస్ ఓ మాస్ సినిమాలో నటించి చాలా కాలం అయ్యింది. ‘మిర్చి’ తర్వాత అతను మరో మాస్ సినిమాలో నటించలేదు. ‘బాహుబలి’ పీరియాడికల్ డ్రామా కాగా, ‘సాహో’ కంప్లీట్ యాక్షన్ మూవీ, రాధే శ్యామ్ ప్యూర్ లవ్ స్టోరీ, ఇక ‘ఆదిపురుష్’ అనేది మైథలాజికల్ డ్రామా. కాబట్టి.. ప్రభాస్ నుండి అభిమానులు ఓ మాస్ మూవీ కోరుకుంటున్నారు.

వాళ్ళ ఆశలన్నీ (Salaar) ‘సలార్’ పైనే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. 10 ఏళ్ళ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మాస్ మూవీ కావడంతో ట్రేడ్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి గ్లిమ్ప్స్ వంటివి ఏవీ రిలీజ్ అయ్యింది లేదు. ‘ఆదిపురుష్’ చిత్రం రిలీజ్ రోజున ‘సలార్’ గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తారు అని అంతా భావించారు.

కానీ అలాంటిదేమి జరగలేదు. ఇక ఈరోజుతో ‘సలార్’ రిలీజ్ కి 100 రోజులు టైం ఉందని ఈరోజు చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. కనీసం మూడు నెలల నుండి ప్రమోషన్ చేస్తే.. ఓపెనింగ్స్ బాగా వస్తాయి. కాబట్టి టీజర్ రిలీజ్ ఎప్పుడు అనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో జూలై 7 న ‘సలార్’ ట్రైలర్ రిలీజ్ అవుతుంది అనే టాక్ జోరుగా నడుస్తుంది. చూడాలి మరి అందులో నిజం ఎంతుందో..!

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus