పాన్ ఇండియా సినిమాకి మరీ ఇంత సింపుల్ స్టోరీనా ??

Advertisement

ఇప్పుడు ప్రభాస్ తెలుగు హీరో కాదు పాన్ ఇండియన్ స్టార్. అందుకే అన్నీ తెలుగు సినిమాలు కాకుండా మల్టీ లింగువల్ సినిమాలు సైన్ చేస్తూ 2030 వరకు తన షెడ్యూల్ ను దాదాపుగా ఖరారు చేస్తున్నాడు. “రాధేశ్యామ్” అనంతరం నాగ్ అశ్విన్ తో ఒక సినిమా, ఓం రావత్ తో ఒక సినిమా, రీసెంట్ గా ప్రశాంత్ నీల్ తో మరో సినిమా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అన్నికంటే రీసెంట్ గా ఎనౌన్స్ చేసిన “సలార్” అనే సినిమా మంచి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.

ప్రభాస్ లుక్, టైటిల్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ గా మారింది. అన్ని ఇండస్ట్రీలు ఈ సినిమాను భీభత్సంగా పొగిడితే.. కన్నడిగులు మాత్రం సినిమాపై మండిపడ్డారు. అది వేరే విషయం అనుకోండి. అయితే.. ఇప్పుడు సోషల్ మీడియాలో “సలార్” స్టోరీ ఇదేనని ఒకటి రచ్చ చేస్తుంది. సదరు సోషల్ మీడియా హల్ చల్ ప్రకారం ప్రభాస్ ఈ సినిమాలో తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం అన్నీ గ్యాంగ్ లను తుదముట్టించి.. తాను కింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ..

స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం కింగ్ మేకర్ గా స్నేహితుడి తమ్ముడి పక్కన ఉండిపోతాడట. ఆ తర్వాత మళ్ళీ ఈగో ఇష్యుస్ కారణంగా అంతర్యుద్ధం మొదలై.. చివరికి ప్రభాస్ అందరినీ వాళ్ళ ఈగోలతో సహా భూస్ధాపిస్తాం చేసి సలార్ గా మిగిలిపోతాడట. ఇండియన్ మూవీ అని చెప్పి మరీ ఇంత సింపుల్ స్టోరీ ఏంటి అని కొందరు భావిస్తున్నారు. కె.జి.ఎఫ్ కి భారీ స్థాయి కాన్వాస్ తో కథ అల్లిన ప్రశాంత్ తన డ్రీమ్ హీరో అయిన ప్రభాస్ తో అంత సింపుల్ స్టోరీ చేయడని ప్రభాస్ అభిమానులు వాదిస్తున్నారు. మరి ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియాలంటే 2023 వరకు ఆగాల్సిందే.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news