Prabhas Sreenu: ఆ విషయంలో ఎన్టీఆర్ నాకు ఎంతో ధైర్యం చెప్పారు: ప్రభాస్ శీను

  • August 5, 2023 / 01:42 AM IST

ప్రభాస్ శ్రీను పరిచయం అవసరం లేని పేరు కమెడియన్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరి సినిమాలలో కూడా నటిస్తూ తన కామెడీ ద్వారా అందరిని పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా ఈయన ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలందరి సినిమాలలో కూడా నటించి మెప్పించారు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రభాస్ శీను ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో నటిస్తున్న సమయంలో నాకు ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు లేదు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నా భార్యకు అబార్షన్ జరిగింది. ఇలా నా భార్యకు అబార్షన్ జరిగింది అనే విషయం ఎన్టీఆర్ కి తెలియడంతో ఆయన ఫోన్ చేసి నాకు ఎంతో ధైర్యం చెప్పారని ప్రభాస్ శీను వెల్లడించారు. ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. నువ్వేం కంగారు పడకు తర్వాత పుట్టేవాడు నాలాంటోడే పుడతారని తారక్ చెప్పారని శీను వెల్లడించారు.

కొద్దిరోజులు మీరు ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్తారా టికెట్స్ బుక్ చేయమంటావా అంటూ తనని అడిగారని, ఆ సమయంలో మాత్రం ఎన్టీఆర్ తనకు చాలా ధైర్యం చెప్పారు అంటూ ఈ సందర్భంగా ఈయన కామెంట్ చేశారు. ఎన్టీఆర్ మనుషులను అమాంతం ప్రేమిస్తారని,ఆయన ఎప్పుడూ అందరితో చాలా సరదాగా ఉంటారని తెలియజేశారు.అయితే ఆయనతో కలిసి సినిమాలలో నటించిన వారికి ఆయన చుట్టూ ఉన్న వారికి మాత్రమే ఈ విషయం తెలుస్తుందని తెలిపారు.

ఇక ఎన్టీఆర్ మంచి నటుడు మాత్రమే కాదు మంచిగా వంట కూడా చేస్తారని ఎన్నో రకాల వంటలను చాలా రుచిగా చేస్తారని ఈ సందర్భంగా ఈయన తెలిపారు. ఇలా ఎన్టీఆర్ గురించి (Prabhas Sreenu) ప్రభాస్ శీను ఎంతో గొప్పగా చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే RRR సినిమా తర్వాత ఈయన పాన్ ఇండియా స్థాయిలో కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవులకు విడుదల కానుంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus