ప్రభాస్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? కొత్తగా ఎన్ని సినిమాలు చేస్తాడు? ఈ లెక్క తేలడం లేదు కానీ.. కొత్త సినిమాల కబుర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఆ దర్శకుడికి ఓకే చెప్పాడు, ఈ దర్శకుడికి ఓకే చెప్పాడు అంటూ వార్తలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ మరో కుర్ర దర్శకుడి కథకు ఓకే చెప్పాడు అంటూ టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో మరోసారి ప్రభాస్ మసి సినిమానే చేస్తాడా అంటూ జోకులు కూడా పేలుతున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం వైద్యం చేయించుకున్న తర్వాత కోలుకునే దశలో ఉన్నాడు. అయితే ఏం వైద్యం జరిగింది, ఏమైంది లాంటి వివరాలు బయటకు చెప్పలేదు అనుకోండి. మోకాలి గాయం అని మాత్రం ఓ రూమర్ వినిపించింది. అయితే త్వరలో షూటింగ్లో తిరిగి పాల్గొంటాడు అని మాత్రం చెబుతున్నారు. ‘సలార్’ సినిమా ప్రచారం కూడా ప్రభాస్ వచ్చాక ఊపందుకుంటుంది అని చెబుతున్నారు. ‘కల్కి’ షూటింగ్ కూడా అప్పుడే ఉంటుంది అని చెబుతున్నారు.
అలాగే మారుతి సినిమా షూటింగ్ ఫైనల్ లెగ్‌లో ఉందని కూడా చెబుతున్నారు. ఇవన్నీ అయ్యాక ప్రభాస్ కొత్త సినిమాను షురూ చేస్తాడని ఆ సినిమాకు శ్రీకాంత్ ఓదెలకు ఛాన్స్ ఇస్తాడు అంటున్నారు. నాని ‘దసరా’ సినిమాతో ఆకట్టుకున్న శ్రీకాంత్ ఓదెల ఇటీవల ప్రభాస్‌కు ఓ పాయింట్ చెప్పారట. అది నచ్చడంతో పూర్తి స్థాయిలో సిద్ధం చేయమన్నారట. ఆ కథ కూడా ‘దసరా’ తరహాలోనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘మసి’ కథలానే ఉంటుంది అని అంటున్నారు.
మరోవైపు ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) నుండి రాబోతున్న ‘సలార్’ కూడా ఇలాంటి కథనే. దీంతో మళ్లీ అదే తరహాలో లుక్‌లో, పాయింట్‌తో సినిమానా అని అభిమానులు కాస్త నిరాశపడుతున్నారు. మాస్ సినిమా అయితే ఓకే కానీ… ‘సలార్ 1’, ‘సలార్ 2’ తర్వాత కూడా అదే లుక్‌లో ప్రభాస్‌ను చూడటం అంతగా బాగుండకపోవచ్చు అంటున్నారు. అయితే మరి శ్రీకాంత్ ఓదెల ఇలాంటి కథే చెప్పారా అనే విషయంలో స్పష్టత లేదు.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!