Prabhas: ప్రభాస్ దూకుడుకు సాటెవ్వరు.. ఆ రికార్డ్ ను బ్రేక్ చేయడం సులువు కాదా?

  • September 9, 2023 / 03:52 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా సలార్ ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే దేశవ్యాప్తంగా టాప్ కలెక్షన్లు సాధించిన సినిమాలను పరిశీలిస్తే ఫస్ట్ డే కలెక్షన్లలో ప్రభాస్ మూవీ టాప్ లో నిలిచింది. ప్రభాస్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన ఆదిపురుష్ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా డే1 కలెక్షన్లలో ఈ సినిమానే టాప్ లో నిలవడం గమనార్హం.

తాజాగా విడుదలైన జవాన్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా ఆదిపురుష్ డే1 రికార్డులను బ్రేక్ చేయలేదు. ఆదిపురుష్ 136.84 కోట్ల రూపాయల డే1 కలెక్షన్లను సొంతం చేసుకుంది. జవాన్ 129 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఆదిపురుష్ సినిమా రికార్డ్ బ్రేక్ కావాలంటే సలార్ మూవీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ప్రభాస్ దూకుడుకు సాటెవ్వరు అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్టార్ హీరో ప్రభాస్ క్రియేట్ చేసిన సంచలన రికార్డులలో కొన్ని రికార్డులు ఎప్పటికీ బ్రేక్ అయ్యే అవకాశాలు లేవు. మరోవైపు సలార్1 2024 సంక్రాంతికి విడుదలైతే సలార్2 ఎప్పుడు విడుదలవుతుందో తేలే అవకాశం ఉంది. ప్రభాస్ సినిమాలన్నీ రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేయడంతో పాటు కళ్లు చెదిరే రేంజ్ లో లాభాలను అందిస్తున్నాయి. తన సినిమాలకు నష్టం వస్తే ప్రభాస్ కొంత మొత్తాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు.

ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్, పాపులారిటీ ఉండటం వల్లే ఆయన డిమాండ్ చేసిన స్థాయిలో పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సైతం సిద్ధపడుతున్నారు. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు ప్రభాస్ మార్కెట్ ను పెంచుతున్నాయి. అయితే ప్రభాస్ తన సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రిలీజ్ డేట్లు మారకుండా జాగ్రత్త పడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus