Prabhas: అనారోగ్యానికి గురైన ప్రభాస్ కోసం ఏ సినిమా షూటింగ్ ఆపేశారంటే..

  • February 7, 2023 / 01:56 PM IST

టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా అండ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ అస్వస్థతకు గురయ్యాడనే వార్త నెట్టింట వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. తమ అభిమాన హీరోకి ఏమయ్యిందంటూ కంగారు పడుతున్నారు. డార్లింగ్ త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు చేస్తున్నారు. అసలేం జరిగిందనేది వివరంగా చూద్దాం.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు హిందీలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ.. క్రేజీ ప్రాజెక్టులు లైనప్ చేస్తూ బీభత్సమైన బిజీగా ఉంది ఎవరంటే..

ప్రభాసే.. ప్రస్తుతం డార్లింగ్ బాలీవుడ్ ఎంట్రీ ‘ఆదిపురుష్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘సలార్’ రెండు భాగాలుగా రానుంది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. ఇప్పటకే సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ అనౌన్స్ చేశారు. ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక భాషల్లో రూపొందుతున్న సినిమా ఇది.. నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెెక్ట్ – K’ చేస్తున్నాడు.

ప్రపంచ మార్కెట్ మీద కన్నేసిన మేకర్స్ తెలుగు పరిశ్రమలో నెవర్ బిఫోర్ అనే రేంజ్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో సడెన్ సర్‌ప్రైజ్ అన్నట్టు మారుతి డైరెక్షన్లో ‘రాజా డీలక్స్’ స్టార్ట్ చేసేశాడు. దిల్ రాజు – ప్రశాంత్ నీల్, మైత్రీ మూవీ మేకర్స్ – హిందీ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో మరో సినిమా లైన్‌లో పెట్టాడు. ఈ ఏడాది ‘ఆదిపురుష్’, ‘సలార్’ ఫస్ట్ పార్ట్.. రెండు సినిమాలతో సందడి చేయనున్నాడు ప్రభాస్..

ఇదిలా ఉంటే డార్లింగ్ ఫ్యాన్స్ అప్‌డేట్ అడుగుతుండడంతో.. టాలీవుడ్ పీఆర్‌‌వో ఒకరు.. ‘‘ఇటీవల ప్రభాస్‌కి జ్వరం వచ్చింది.. ఈ కారణంగా ఈనెలలో ఉండాల్సిన మారుతి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మూవీ షెడ్యూల్ ఉండకపోవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇది వారం రోజుల క్రితం సంగతి.. ఫ్యాన్స్ అప్‌డేట్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను’’ అంటూ ట్వీట్ చేయడంతో.. ‘‘హెల్త్ ముఖ్యం.. షూటింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చ.. త్వరగా కోలుకో డార్లింగ్’’ అంటూ రెబల్ స్టార్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus