Prabhu, Aishwarya: కోట్లు విలువ చేసే కట్న కానుకలు పంపిన ప్రభు!

  • December 18, 2023 / 12:02 PM IST

సినీ నటుడు ప్రభు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ నటుడు జెమినీ గణేషన్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ప్రభు కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటికీ ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఇటీవల ప్రభు కుమార్తె ఐశ్వర్య ప్రముఖ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

వీరి వివాహం చెన్నైలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు విశాల్ మణిరత్నం సుహాసిని వంటి పలువురు కోలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఐశ్వర్యకు ప్రభు ఇచ్చిన కట్న కానుకల గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈయన పెళ్లి సమయంలో తన కుమార్తెకు తన కుటుంబానికి వారసత్వంగా వస్తున్నటువంటి నగలతో పాటు, కోటి రూపాయల నగదు అలాగే చెన్నైలో విలాసవంతమైనటువంటి బంగ్లా కూడా కానుకగా ఇచ్చారని తెలుస్తుంది. ఇకపోతే ఐశ్వర్యకు ఇది రెండో వివాహం కావటం గమనార్హం. 2009వ సంవత్సరంలోనే ప్రభు వరుసకు మేనల్లుడు అయ్యేటటువంటి కునాల్ అనే వ్యక్తితో ఈమె వివాహం జరిగింది.

వృత్తిపరంగా వీరిద్దరూ లండన్ లో స్థిరపడ్డారు కానీ తన భర్తతో (Aishwarya) ఐశ్వర్యకు మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా భర్త నుంచి దూరమైనటువంటి ఈమె తిరిగి డైరెక్టర్ అధిక్ ప్రేమలో పడ్డారు. ఇక వీరి వివాహం చెన్నైలో ఇటీవల ఎంతో ఘనంగా జరిగింది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus