Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

సినిమా థియేటర్‌లో పూజలు చేయడం, ప్రసాదాలు పంచడం లాంటివి మనం డివోషనల్‌ సినిమాలకే చూస్తుంటాం. గతంలో తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ దేవుడి సినిమాలు వస్తే ఇలాంటివి జరిగాయి. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి ఒళ్లు జలదరించే సినిమా ‘ఆదిపురుష్‌’ సినిమాకు అయితే థియేటర్లలో ఒక సీట్‌ని హనుమంతుడికి కోసం విడిచి పెట్టారు. ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు నాన్‌ డివోషన్‌ సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారు.

Vvaan

సిద్ధార్థ్‌ మల్హోత్రా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ది వన్‌: ఫోర్స్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌’. ఇటవల విడుదలైన ఈ సినిమాకు ఆశించిన స్పందన అయితే రాలేదు. అయితే ఇందులో ఉత్తరాది ప్రజలు జరుపుకునే ఛఠ్‌ పూజ నేపథ్యంలో తమన్నాపై ఓ పాటను చిత్రీకరించారు. ‘ఛఠీ మైయా..’ అంటూ సాగే ఆ పాటకు మహిళా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. తమ సంస్కృతిని ఆవిష్కరించిన ఈ పాట తమకెంతో నచ్చిందని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

ఛఠ్‌ వేడుకల సమయంలో ప్రసాదంగా స్వీకరించే ఠెకువా అనే స్వీట్‌ కుకీలను కొంతమంది మహిళలు థియేటర్లలోకి తీసుకెళ్తున్నారు. ‘ఛఠీ మైయా..’ పాట వచ్చిన సమయంలో ఠెకువాను తోటి ప్రేక్షకులకు పంచి పెడుతున్నారు. బిహార్‌లోని ఓ థియేటర్‌కు ఛఠ్‌ పూజ సమయంలో ధరించే సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ఓ ప్రేక్షకురాలు ఠెకువాను పంచుతున్న వీడియో సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది.

ఈ సినిమా కథ సంగతి చూస్తే.. దేవాంచల్‌కు చెందిన రిషి (సిద్ధార్థ్ మల్హోత్రా), అతని భార్య మమత (తమన్నా) ముంబయిలో ఉంటూ ఉంటారు. పెళ్లయి ఆరేళ్లయినా పిల్లలకు కలగకపోవడంతో మనో వేదనకు గురవుతుంటారు. అన్ని ప్రయత్నాలు చేసి, ఐవీఎఫ్‌కు వెళ్దామని అనుకుంటారు. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో డబ్బు కోసం ఆలోచిస్తారు. సొంతూరులో తమకు ఉన్న భూమిని అమ్మేసి డబ్బులు అరేంజ్‌ చేసుకుందాం అనుకుంటారు. దాని కోసం సొంతూరికి వెళ్లిన రిషికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేదే సినిమా కథ.

 రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus