Prashanth Neel, Prabhas: ప్రభాస్ ఆ పని చేస్తేనే సలార్ మొదలవుతుందా?

  • May 17, 2022 / 03:07 PM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ మూవీ ఇప్పటికే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సలార్ షూట్ మొదలుకావాలంటే ప్రభాస్ బరువు తగ్గాలని ప్రశాంత్ నీల్ షరతు విధించారని బోగట్టా.

సలార్ మూవీని వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో విడుదల చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. సలార్ రెండు భాగాలుగా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొంటున్నారని అదే సమయంలో బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బోగట్టా. రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి ప్రభాస్ లుక్స్ విషయంలో విమర్శలు వచ్చాయి. ప్రభాస్ మారుతి కాంబో మూవీ తాత్కాలికంగా వాయిదా పడిందని మారుతి బౌండ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినా ఈ సినిమా షూటింగ్ మాత్రం ఆలస్యం కానుందని సమాచారం.

మరోవైపు ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న సినిమాలు విడుదలైన తర్వాతే ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తి కావడానికి 2025 సంవత్సరం వరకు సమయం పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు ప్రభాస్ పెళ్లికి సంబంధించిన శుభవార్త కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ మ్యారేజ్ గురించి తీపికబురును ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus