Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

ప్రీతి ముకుందన్‌.. ఇండస్ట్రీలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఎంట్రీ ఇచ్చింది కూడా తెలుగు సినిమాతోనే. ఆ తర్వాత తెలుగులో ఓ సినిమా కూడా చేసింది. ఆ సినిమా టీమ్‌ ప్రచారంలో ఆమెను పట్టించుకోలేదు అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే.. ఆ తర్వాత రెండేళ్లు ఆమె నుండి తెలుగులో సినిమా రాలేదు. ఈ ఏడాది ఆఖరులో ఓ సినిమా వస్తుంది అంటున్నారు. అలా అని ఆమె ఏమీ ఖాళీగా లేదు. సౌత్‌లో వరుస సినిమాలు చేస్తూ ఉంది. అయితే రీసెంట్‌ సినిమాల ఫలితాలు చూశాక ఆమె టైమ్‌ మొదలైంది అని అనిపిస్తోంది.

Preity Mukhundhan

ప్రస్తుతం ప్రీతి ముకుందన్‌ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తెలుగు సినిమా. మరొకటి తమిళ సినిమా కాగా.. మూడో సినిమా బాలీవుడ్‌ ఎంట్రీ. అవును ప్రీతి ‘నాగ్జిల్లా’ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఈ మూడు సినిమాలు కాకుండా తమిళంలో మరో సినిమా ఓకే చేసిందట. ధనుష్‌ హీరోగా తమిళరసన్‌ పచ్చముత్తు దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ప్రీతిని హీరోయిన్‌గా తీసుకుంటున్నారట. ఈ మేరకు చర్చలు తుది దశకు చేరుకున్నాయి అని సమాచారం.

శ్రీకాంత్‌ తనయుడు హీరోగా రూపొందుతున్న ‘ఏమో ఏమో ఇది’ అనే సినిమాతోపాటు.. హరీశ్‌ కల్యాణ్‌ హీరోగా తమిళంలో రూపొందుతున్న ‘దషమకన్‌’ మరో సినిమా. హిందీ సినిమా వివరాలు పైనే చెప్పేశాం. ఇవన్నీ ఓకే అయి బయటకు వచ్చిన సినిమాల విషయాలు. ఇవి కాకుండా తెలుగులో మరో మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. ఇక ఈ ఊపుకు కారణమేంటా అనుకుంటున్నారా? ఈ ఏడాది ఆమె నుండి వచ్చిన ‘బ్లాస్ట్‌’, ‘ఇదయం మురళి’. ఈ రెండు సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి.

‘బ్లాస్ట్‌’ యాక్షన్ టచ్‌తో అదరగొట్టగా.. ‘హృదయం మురళి’లో క్యూట్‌ టచ్‌ ఇచ్చింది. ఇంత వైవిధ్యం చూపించాక మన దర్శకనిర్మాతలు ఊరుకుంటారా? కాంటాక్ట్‌ కోసం ప్రయత్నాలు స్టార్ట్‌ చేశారు. చూద్దాం ఏయే సినిమాలు ఓకే చేస్తుందో?

నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus