RRR Movie: రాజమౌళి నిర్ణయానికి అసలు కారణమిదా?

దర్శకుధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2018 నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా ఈ మూవీ రిలీజ్ కోసం చరణ్, తారక్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. రెండు పాటల షూటింగ్ మినహా ఆర్ఆర్ఆర్ మూవీ పూర్తి కాగా ఈ సినిమాలోని ఒక్క పాట కోసమే రాజమౌళి ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం.

భారతీయ సినీ చరిత్రలోనే ఈ స్థాయిలో ఒక్క పాట కోసం ఏ దర్శకుడు ఖర్చు చేయలేదని తెలుస్తోంది. అయితే ఇప్పటికే రెండుసార్లు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్లు మారగా తాజాగా విడుదలైన పోస్టర్లలో మాత్రం ఆర్ఆర్ఆర్ కచ్చితంగా అక్టోబర్ 13వ తేదీనే రిలీజవుతుందని రాజమౌళి చెబుతున్నారు. అయితే జక్కన్నపై ఒత్తిడి పెరుగుతుండటం వల్లే రిలీజ్ డేట్ ను మార్చకూడదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రిలీజ్ డేట్ మారితే నిర్మాతపై అదనపు భారం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

డెడ్ లైన్ పెట్టుకుని మరీ రాజమౌళి ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. రాజమౌళి ఒత్తిడితో పని చేస్తే ఔట్ పుట్ పై ఆ ప్రభావం పడుతుందా..? అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గురించి వ్యక్తమవుతున్న ఎన్నో సందేహాలకు జవాబులు దొరకాలంటే ఈ సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus