‘బస్ స్టాప్’ ‘రొమాన్స్’ వంటి యూత్‌ఫుల్ మూవీస్..తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రిన్స్ సెసిల్(Prince Cecil) అందరికీ సుపరిచితమే. ఆ తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 1’ ‘డిజె టిల్లు’ ‘టిల్లు స్క్వేర్’ వంటి సినిమాలతో ఇతను మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ‘స్కంద’ వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్ కూడా చేశాడు. అప్పుడప్పుడు పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ వస్తున్న ప్రిన్స్.. ఇటీవల పెళ్లిచేసుకోబోతున్నట్టు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు.
తాజాగా ప్రిన్స్ వివాహం ఎన్ఆర్ఐ అయినటువంటి సాయి మాచిరాజుతో ఘనంగా జరిగింది. న్యూజిలాండ్..లో ప్రిన్స్, సాయి మాచిరాజు..ల వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి విదేశాల్లో జరిగినప్పటికీ, అది పూర్తిగా మన తెలుగు సంప్రదాయాల ప్రకారం, వేద మంత్రాలతో జరిగింది. వదూవరుల ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో ప్రిన్స్ వివాహం నిరాడంభరంగా పవిత్రంగా జరిగింది అని చెప్పాలి.
తన జీవితంలో జరిగిన ఈ మధురమైన ఘట్టానికి సంబంధించిన ఫోటోలను ప్రిన్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.కొద్దిసేపటికే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. సాంప్రదాయ పట్టు వస్త్రాల్లో నూతన వధూవరులు ఎంతో చూడముచ్చటగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన తర్వాత నెటిజెన్లు నూతన వధూవరులకి కంగ్రాట్స్ అంటూ తమ బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు. అలాగే ఈ శుభవార్త తెలుసుకున్న కొందరు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రిన్స్ దంపతులకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.