Prithviraj, Balakrishna: బాలకృష్ణతో సినిమా తీస్తానంటున్న పృథ్వీరాజ్ సుకుమారన్.. సాధ్యమేనా?

భాషతో సంబంధం లేకుండా నటుడిగా, దర్శకుడిగా పాపులారిటీని సొంతం చేసుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి ప్రతిభ ఉన్నవాళ్లలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఒకరని చెప్పవచ్చు. పృథ్వీరాజ్ నటించిన ది గోట్ లైఫ్ (The Goat Life) సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ స్టార్ హీరో బాలకృష్ణతో (Balakrishna) ఒక సినిమా తీస్తానని చెబుతున్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. మలయాళం స్టైల్ కమర్షియల్ సినిమాను బాలయ్యతో తెరకెక్కించాలని పృథ్వీరాజ్ సుకుమారన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అయితే బాలయ్యను మరోసారి కొత్తగా చూసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బాలయ్య పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అవుతుందని ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య పృథ్వీరాజ్ సుకుమారన్ కు డేట్స్ ఇవ్వడం సులువైన విషయం కాదు. ఈ కాంబినేషన్ లో సినిమా రావాలంటే మాత్రం చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బాలయ్య బాబీ మూవీ షూటింగ్ కు కొంతకాలం బ్రేక్ పడగా ఎన్నికల తర్వాత ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

బాబీ వేర్వేరు ఇంటర్వ్యూలలో బాలయ్యకు కెరీర్ బెస్ట్ హిట్ ఇస్తాననేలా కామెంట్లు చేస్తున్నారు. 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత లేదు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే రానున్నాయి.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus