Indraja Shankar: సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy), స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee Kumar) కాంబినేషన్లో వచ్చిన ‘బిగిల్’ (Bigil)  సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఈ సినిమా ‘విజిల్’ పేరుతో రిలీజ్ అయ్యింది. ఇందులో విజయ్ డబుల్ రోల్ ప్లే చేశాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విమెన్ ఫుట్ బాల్ ప్లేయర్స్ టీం కోచ్ గా ఇందులో విజయ్ నటించారు.

ఇక ఈ ఫుట్ బాల్ ప్లేయర్స్ టీంలో భారీ కాయంతో ఒక అమ్మాయి ఉంటుంది. బహుశా ఆమెను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమా విడుదల టైంలో.. ఆ పాత్ర గురించి వివాదాలు కూడా తలెత్తాయి. ఆమె పేరు ‘ఇంద్రజ శంకర్’(Indraja Shankar) . అయితే ఈమె సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.వివరాల్లోకి వెళితే.. నటి ఇంద్రజ తన స్నేహితుడు, దర్శకుడు అయిన కార్తీక్‏ను నిన్న అంటే మార్చి 24న ఆదివారం నాడు చెన్నైలో పెళ్లి చేసుకుంది.

వీరి పెళ్ళికి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ‘దేవుడి ఆశీస్సులు, పెద్దల సమక్షంలో మేము ఒక్కటయ్యాం’ అంటూ తన పెళ్లి విషయాన్ని తెలిపి ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇంద్రజ. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన వారు తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus