Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

‘చిరునవ్వుతో’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘వయసైపోయిన హీరోలంతా రాజకీయాల్లో సెటిల్ అయిపోయినట్టు’ అంటూ త్రివిక్రమ్ (Trivikram) రాసిన డైలాగ్ అది. ఇది ఒకప్పటి సీనియర్ హీరోయిన్ల విషయంలో నిజమైంది. ఇప్పుడైతే కొంతమంది సీనియర్ హీరోయిన్లు ఆ పద్ధతిని మార్చే పనిలో పడ్డారు. అందులో టాప్ హీరోయిన్ ప్రియమణి ఒకరు. ఈమె హీరోయిన్ గా ఫేడౌట్ అయిపోయి చాలా కాలం అయ్యింది. అయినా సరే ఒక్కో సినిమాకి కొట్టిన్నర సంపాదిస్తుందట. అదెలా అనుకుంటున్నారా? ఓటీటీల్లో మెయిన్ రోల్స్ చేయడం వల్ల అని చెప్పాలి.

Priyamani

అవును హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత ప్రియమణి (Priyamani) రీ- ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది. కానీ ఏవీ కూడా ఈమె కెరీర్ కు ప్లస్ కాలేదు. కానీ ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన ‘భామా కలాపం’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఓటీటీ కంటెంట్ కి ఇప్పుడు ప్రియమణి బెస్ట్ ఛాయిస్ అయిపోయింది.

ఆమె ఓ కథ ఓకే చేసింది అంటే చాలు ఓటీటీ సంస్థలు రూ.3 కోట్ల నుండి రూ.5 కోట్ల వరకు అప్రూవల్స్ ఇచ్చేస్తున్నాయి. అలా ప్రియమణి ఓటీటీ మార్కెట్ ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఒక్కో సినిమాకు ఆమె కోటిన్నర డిమాండ్ చేస్తుంది. ఆమె నటించింది అంటే.. ఓటీటీల రూపంలో మంచి ఆఫర్స్ వస్తాయి నిర్మాతలకి. అందుకే ప్రియమణి తగ్గడం లేదు. కాకపోతే ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఏ థియేట్రికల్ సినిమా కూడా విజయం సాధించలేదు. అదే మైనస్ అని చెప్పాలి.

స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus