Priyamani: నల్లగా ఉంటే ఏంటి..? మండిపడ్డ హీరోయిన్!

  • June 17, 2021 / 01:39 PM IST

టాలీవుడ్ లో హీరోయిన్ గా సినిమాలు చేసిన ప్రియమణి ఇప్పుడు పలు వెబ్ సిరీస్, టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.. కొన్నిరోజుల క్రితం కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన ప్రియమణి ఇప్పుడు బాడీ షేమింగ్ పై రియాక్ట్ అయింది. తన కెరీర్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. చాలా మంది తనను నల్లగా ఉన్నావ్ అంటూ విమర్శించేవారని.. ముఖం తెల్లగా ఉంది.. కాళ్లు ఎందుకు నల్లగా ఉన్నాయంటూ కామెంట్ చేసేవారని చెప్పింది.

నల్లగా ఉంటే ఏంటి..? నేను తెల్లగా ఉన్నానని ఎప్పుడూ చెప్పలేదు కదా అంటూ ప్రశ్నించింది. తనకది చామనఛాయ శరీరమని.. నల్లగా ఉన్నా సమస్య ఏంటంటూ మండిపడింది. వ్యక్తులని బ్లాక్ అండ్ వైట్ అని పిలవడం తనకు ఇష్టం ఉండదని.. నలుపులో కూడా అందం దాగి ఉంటుందని చెప్పుకొచ్చింది. కృష్ణుడు కూడా నల్లగానే ఉంటాడని.. కానీ అందగాడని చెప్పుకొచ్చింది. అలానే తన బరువుపై జరిగిన ట్రోలింగ్ పై స్పందించింది.

ఒకానొక సమయంలో 65 కిలోల వరకు బరువు పెరగడంతో.. పెద్దదానిలా కనిపించేదాన్నని.. ఆ సమయంలో చాలా మంది లావుగా ఉన్నవని కామెంట్స్ చేసేవారని చెప్పింది. ఇప్పుడేమో ఎందుకింత సన్నగా మారిపోయావని అడుగుతున్నారని.. బరువు పెరిగినా.. తగ్గినా ట్రోలింగ్ చేశారని బాధపడింది. ప్రస్తుతం ప్రియమణి నటించిన ‘నారప్ప’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus