ప్రియాంక చోప్రా నిర్ణయం ఎంతవరకూ కరెక్ట్.!

అప్పట్లో శ్రీదేవితో ఎన్టీయార్, ఏయన్నార్, కృష్ణ వంటి అగ్ర కథానాయకులంతా పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. అందుకు కారణం అప్పట్లో క్రేజ్ ఉన్న ఏకైక కథానాయకి ఆమె కావడం. సొ, ఎక్కువ ఆప్షన్స్ లేకపోవడంతో ఉన్న శ్రీదేవితోనే ఎక్కువ సినిమాల్లో నటించారు అప్పట్లో మన హీరోలందరూ. కానీ.. రాను రాను హీరోలు తక్కువయ్యారు, హీరోయిన్ల సంఖ్య ఎక్కువైంది. ప్రపంచంలో పది మంది అబ్బాయిలకి ఆరుగురు అమ్మాయిలు మాత్రమే ఉంటే.. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి కనీసం అయిదారుగురు హీరోయిన్లు ఎవైలబిలిటీలో ఉన్నారు. అందుకే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు తాము ఒక్కసారి నటించిన హీరోయిన్లను మళ్ళీ రిపీట్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. అయితే.. ఈ రిపిటీషన్ ను సల్మాన్ ఖాన్ పెద్ద సీరియస్ గా తీసుకొన్నట్లు లేదు. అందుకే ఇప్పటికే అయిదాసార్లు జత కట్టిన ప్రియాంక చోప్రాతో ముచ్చటగా ఆరోసారి జతకట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు.

అలీ అబ్బాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న “భరత్” షూటింగ్ మొన్న మొదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సల్మాన్ సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనుంది. త్వరలోనే సెట్స్ లో జాయిన్ అవ్వనుంది. హాలీవుడ్ లో బిజీ అయిపోయిన ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రమిది. ఇకపోతే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో నిందితుడైన నిరవ్ మోడీకి చెందిన జ్యూవెలరీ సంస్థకు ప్రచారకర్తగా కొనసాగడం తనకు ఇష్టం లేదంటూ అగ్రిమెంట్ ను చించేసిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు కృష్ణజింక కేసులో ప్రధాన నిందితుడిగా ప్రూవ్ చేయబడి శిక్ష కూడా వేయబడిన సల్మాన్ సరసన కథానాయికగా నటించనుండడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు కొందరు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus