Priyanka Jain: బిగ్ బాస్ నుంచి భారీ రెమ్యూనరేషన్ అందుకున్న ప్రియాంక!

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సీరియల్ నటి ప్రియాంక జైన్ ఒకరు. ఈమె సీరియల్ నటిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకొని మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఫిజికల్ టాస్క్ లలోనూ ఇతర టాస్కులలో కూడా ఈమె ఎంతో అద్భుతంగా తన ప్రదర్శనను కనబరుస్తూ వచ్చారు. ఇలా ప్రతివారం తనని తాను నిరూపించుకుంటూ ఫినాలే వరకు చేరుకున్నారు.

ఇలా ఈ సీజన్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి లేడీ కంటెస్టెంట్ గా ప్రియాంక ఉన్నారు. ఇకపోతే 15వ వారంలో తనకంటే ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ముందు ఉండడంతో కప్పు అందుకోవడం అసాధ్యం అయింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక రెమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈమె 15 వారాలపాటు హౌస్ లో కొనసాగినందుకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

ప్రియాంక సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమె బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడానికి ముందే వారితో వారానికి తనకు 2.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. ఈ క్రమంలోనే 15 వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి ప్రియాంక మొత్తం 37.5 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది. ఇలా ఈమె బిగ్ బాస్ నుంచి భారీ మొత్తంలోనే అందుకున్నారని చెప్పాలి.

ఇంత మొత్తంలో డబ్బు సంపాదించడంతో (Priyanka Jain) ప్రియాంక ఆర్థికంగా కూడా కాస్త సెటిల్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఈమె ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది అంటూ తన ప్రియుడు శివకుమార్ తన కుటుంబ పరిస్థితిని కూడా తెలియజేశారు. ఇక ఈ డబ్బు తన కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాలి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus