సినిమాల్లో ఉన్నట్లే బయటా ఉంటారా? సినిమా సినిమానే.. బయట మనుషులు బయటనే. రెండింటినీ కలపొద్దు అని అనేవారు పెద్దలు. అయితే సినిమాల్లో ఏం చేశారో బయటా అదే చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు వచ్చాక ఈ మాట మారిపోయింది. తొలుత సోషల్ మీడియాలో ఫొటోలు, రీల్స్ చేస్తూ వచ్చిన ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇప్పుడు వాటికి మించిన వీడియోలు సిద్ధం చేస్తున్నారు. అలాంటి ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు యువ నటీనటులు, చాలా ఏళ్లుగా కపుల్‌గా ఉన్న ప్రియాంక జైన్ – శివ కుమార్.
వాళ్లిద్దరినీ సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వారికి ప్రియాంక శివ్ ఏం వీడియో చేశారు, అందులో ఎంత హీట్ పుట్టించారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవేళ మీరు ఫాలో కాకుండా ఉంటే.. వాళ్లు ‘టాక్సిక్’ సినిమా నుండి రీసెంట్‌గా వచ్చిన రొమాంటిక్ సాంగ్ ‘తబాహీ’కి రీల్ చేశారు. ఆ ఒరిజినల్ సాంగ్‌లో హీరో యశ్, కియారా అడ్వాణీ ఎంత హీట్ పుట్టించారో ఇప్పుడు వీరిద్దరూ అంతే పుట్టించారు అంటే అతిశయోక్తి కాదు.
ప్రియాంక జైన్ గ్లామర్ డోస్ బాగానే వడ్డిస్తుందని తెలిసినా.. ఇటీవల కాలంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు చాలా వరకు పద్ధతిగానే ఉన్నాయి. కానీ నిన్న ‘తబాహీ’ పాట అందంతో నిండిపోయింది. మరోవైపు శివ్ కూడా కండలు తిరిగిన శరీరాన్ని చూపించి పాటను రక్తికట్టించాడు. సినిమాల పాటలకు రీల్స్ చేయడం ఇన్‌ఫ్లూయెన్సర్లకు కొత్తేం కాదు. చాలా ఏళ్లుగా చేస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటి పాటలకు చేసి మెప్పించడం పెద్ద విషయమే.
గత కొంకాలంగా ప్రేమలో, రిలేషన్‌లో ఉన్న ప్రియాంక – శివ్ త్వరలో పెళ్లి చేసుకుంటాం అంటూ చెబుతూనే ఉన్నారు. కాలెండర్లు మారుతున్నాయి కానీ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. ఈ ఏడాదైనా చేసుకుంటారేమో చూడాలి.