Ashwini Dutt: ‘కల్కి 2’ పై నిర్మాత అశ్వినీదత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • June 29, 2024 / 06:22 PM IST

‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) సినిమా రెండు రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుంది ఈ మూవీ. ఇప్పటికే రూ.280 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను అధిగమించింది అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ ఈ సినిమాకి ఎక్కువగానే కనిపిస్తుంది.

బాహుబలి 2 (Baahubali2) తర్వాత ప్రభాస్ (Prabhas) చేసిన సినిమాల్లో ఈ సినిమాకే ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. మరోపక్క ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని టీం ముందుగా ప్రకటించలేదు. కానీ సినిమా క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారు. కచ్చితంగా సెకండ్ పార్ట్ ఉండాలి అనేట్టుగా ఈ సినిమా క్లైమాక్స్ ఉంది.

అయితే సెకండ్ పార్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? వంటి సందేహాలు అందరిలో ఏర్పడ్డాయి. తాజాగా ఈ విషయంపై ‘కల్కి..’ నిర్మాత అశ్వినీదత్ (C. Aswani Dutt) స్పందించారు. ‘కల్కి 2898 ad’ సినిమా విషయంలో మేము ముందుగా అనుకున్నప్పుడు పార్ట్ 2 ఆలోచన లేదు. కమల్ హాసన్ కి  (Kamal Haasan) కథ నేరేట్ చేస్తున్నప్పుడు కూడా నాగ్ అశ్విన్ కి (Nag Ashwin) ఆ ఆలోచన లేదు.

తర్వాత ఇది 2 పార్టులుగా చెబితే బాగుంటుంది అని అతనికి అనిపించింది. పార్ట్ 2 సంబంధించి ఆల్రెడీ 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ మేజర్ పార్ట్ షూట్ చేయాలి. కాబట్టి.. ఎప్పుడు రిలీజ్ అనేది అప్పుడే చెప్పలేం” అంటూ చెప్పుకొచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus