టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నిర్మాతలలో బన్నీవాస్ (Bunny Vasu) ఒకరు కాగా ఈ నెల 15వ తేదీన విడుదల కానున్న ఆయ్ (AAY) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా బన్నీవాస్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. నాకు కష్టం వస్తే ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ ముందుంటారని ఆయన కామెంట్లు చేశారు. వాళ్లలో ఒకరు మా అమ్మ అయితే రెండో వ్యక్తి నా ఫ్రెండ్ అల్లు అర్జున్ (Allu Arjun) అని బన్నీవాస్ పేర్కొన్నారు.
ఆయ్ సినిమా ప్రమోషన్స్ సరిగ్గా జరగడం లేదని బన్నీతో పోస్ట్ పెట్టించాలని మా టీమ్ నన్ను కోరిందని నేను బన్నీని అడగకపోయినా బన్నీ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పోస్ట్ పెట్టారని ఆయన తెలిపారు. నాకు అవసరం ఉన్న ప్రతి సందర్భంలో బన్నీ ముందుండి నడిపిస్తారని బన్నీవాస్ పేర్కొన్నారు. ఒక ఫ్రెండ్ కు కష్టమొస్తే ఎలా సపోర్ట్ చేయాలో తెలిసిన ఏకైక వ్యక్తి అల్లు అర్జున్ అని బన్నీవాస్ చెప్పుకొచ్చారు.
20 సంవత్సరాల క్రితం నేను గీతా ఆర్ట్స్ నుంచి వెళ్లిపోవాల్సిన సంఘటన ఎదురైందని ఆరోజు బన్నీ నాకు సపోర్ట్ చేయడం కోసం వాళ్ల నాన్నను సైతం ఎదురించారని ఆయన వెల్లడించారు. అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే నేను ఈ స్థానంలో ఉండేవాడిని కాదని బన్నీవాస్ (Bunny Vasu) పేర్కొన్నారు. తన ఫ్రెండ్స్ లో ఎవరికి ఏ అవసరం వచ్చినా బన్నీ సపోర్ట్ చేస్తారని బన్నీవాస్ చెప్పుకొచ్చారు.
బన్నీ మంచి వ్యక్తి అని బన్నీవాస్ వెల్లడించడం గమనార్హం. నేను మొదటినుంచి పవన్ అభిమానినని బన్నీవాస్ అన్నారు. పవన్(Pawan Kalyan) తో పాటు పొలిటికల్ జర్నీలో ఉంటున్నానంటే నా లక్ అనే చెప్పాలని బన్నీవాస్ పేర్కొన్నారు. ఆయ్ సినిమాతో నార్నె నితిన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాలి. నార్నె నితిన్ (Narne Nithin)కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.