స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా వివాదాలకు వీలైనంత దూరంగా ఉంటారు. సమంత ఎవరు కష్టాల్లో ఉన్నా తట్టుకోలేరని ఇతరులకు తన వంతు సహాయం చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే నాగచైతన్య శోభిత నిశ్చితార్థం తర్వాత సమంతను టార్గెట్ చేస్తూ చిత్ర విచిత్రమైన కథనాలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. ఆ కథనాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. సమంత తన ఆస్తులను అనాథలకు పంచేస్తారంటూ ఒక వార్త వైరల్ అవుతుండగా సమంత ఇకపై ముంబైకు పరిమితం కానున్నారని మరో వార్త వినిపిస్తోంది.
అయితే ఈ వార్తలు ఏ మాత్రం ఆధారాలు లేని వార్తలు కావడం గమనార్హం. సమంతను కావాలనే టార్గెట్ చేస్తూ కొంతమంది ఈ తరహా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. సమంతకు ఏ మాత్రం సంబంధం లేని గాసిప్స్ పుట్టిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత గతంలో విడిపోతున్నట్టు ప్రకటించిన సమయంలో ఆమెను టార్గెట్ చేస్తూ ఎన్నో కథనాలు వెలువడగా ఆ సమయంలో సమంత ఫేక్ వార్తలను భరించలేక కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
సమంత తన గురించి మళ్లీ ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో మరోసారి అలర్ట్ అయితే మంచిది. సమంత స్పందించకపోతే ఈ తరహా వార్తలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు సమంత ఎప్పటినుంచి షూటింగ్ లలో ఎప్పటినుంచి పాల్గొంటారని ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. సిటాడెల్ వెబ్ సిరీస్ తో సమంత మరోమారు సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
సమంత వయస్సు పెరుగుతున్నా గ్లామరస్ గా కనిపిస్తూ అభిమానులను మెప్పిస్తుండటం కొసమెరుపు. సమంత రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. సమంత రెమ్యునరేషన్ 3 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. సిటాడెల్ వెబ్ సిరీస్ కు మాత్రం సామ్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు.