C Kalyan: రాజమౌళి సినిమా హిట్ అవ్వడానికి వాళ్లే కారణం!

  • August 5, 2023 / 02:43 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక దీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి. సీరియల్ డైరెక్టర్ గా తన కెరియర్ ప్రారంభించిన ఈయన అనంతరం సినిమాలకు దర్శకుడుగా మారారు.ఇలా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు అపజయం కాలేదు. ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో జక్కన్న ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లినటువంటి దర్శకుడిగా కూడా గుర్తింపు పొందారు.

ఈయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అనంతరం RRRసినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. ఇలా ఆస్కార్ రావడానికి కారణమైనటువంటి దర్శకుడు రాజమౌళి పట్ల సీనియర్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన రాజమౌళి గురించి మాట్లాడుతూ రాజమౌళి ఐదు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తారని కామెంట్ చేశారు.

ఈ విధంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి సినిమా చేస్తే తప్పకుండా హిట్ అవుతాయని తెలిపారు. అంతేకాకుండా రాజమౌళి చేసే సినిమాలన్నీ కూడా స్టార్ హీరోలతోనే చేస్తారని అందుకే ఆయన సక్సెస్ అందుకుంటారని తెలిపారు. ఇండస్ట్రీలో స్టార్డం లేనటువంటి వారిని లేదా కొత్త వారిని తీసుకువచ్చి ఇలాంటి సక్సెస్ సాధించినప్పుడే దర్శకుడిగా తాను గుర్తింపు పొందినట్లు అంటూ ఈ సందర్భంగా కళ్యాణ్ (C Kalyan) జక్కన్న గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇలా స్టార్ హీరోలతో సినిమా చేయడంలో గొప్పేమీ లేదని తెలిపారు. అంతేకాకుండా ఎప్పుడైతే ప్రేక్షకుల నాడి తెలిసి వారి అభిరుచులకు అనుగుణంగా సినిమాలు చేసినప్పుడే సినిమాలు సక్సెస్ అవుతాయని ఈ సందర్భంగా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా దర్శకుడు పట్ల నిర్మాత కళ్యాణ్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus