Devara: దేవర ఫస్ట్ సింగిల్ పై అంచనాలు పెంచిన నిర్మాత.. అలా కామెంట్స్ చేస్తూ?

  • May 16, 2024 / 10:10 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మరో నాలుగు రోజుల్లో పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు. తారక్ పుట్టినరోజు అభిమానులకు సైతం ఎంతో స్పెషల్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది. ఫియర్ సాంగ్ అంటూ దేవర మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుండటం గమనార్హం. దేవర (Devara) సినిమాలో మరోసారి ఊరమాస్ పాత్రలో తారక్ కనిపించనున్నారని ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చేసింది.

ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) దేవర ఫస్ట్ సింగిల్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. జైలర్ హుకుమ్ సాంగ్ ను మించేలా దేవర ఫస్ట్ సింగిల్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దేవర ఫియర్ సాంగ్ ఫర్పెక్ట్ సాంగ్ అని నాగవంశీ చెప్పుకొచ్చారు.

మీ అందరి కంటే ముందు నేను ఆ పాట విన్నానని నన్ను నమ్మాలని హుకుం సాంగ్ ను మరిచిపోతారని నాగవంశీ కామెంట్లు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ (Anirudh Ravichander) నెక్స్ట్ లెవెల్ మాస్ అని దేవర ముంగిట నువ్వెంత అంటూ నాగవంశీ పోస్ట్ చేశారు.అక్టోబర్ 10వ తేదీన విడుదల కానున్న దేవర మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉండనుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ గతంలో ఏ సినిమా కోసం పడని స్థాయిలో ఈ సినిమా కోసం కష్టపడ్డారని సమాచారం అందుతోంది. దేవర సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus