Suchitra, Dhanush: ధనుష్ పై మరోసారి సుచిత్ర సంచలన వ్యాఖ్యలు!

  • May 14, 2024 / 10:51 PM IST

తమిళ సింగర్ సుచిత్ర (Suchitra Ramadurai) తెలుగు వారికి కూడా సుపరిచితమే. తమిళంలోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ పాడింది. ‘అతడు’ (Athadu) లో చందమామ (Chandamama) , ‘హ్యాపీ’ లో ఒస్సారే, ‘పోకిరి’ (Pokiri) లో డోలె డోలె వంటి ఎన్నో సాంగ్స్ ఈమె పాడటం జరిగింది. అవన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అయితే ఈ రకంగా సుచిత్ర ఎంతమందికి గుర్తుంటుందో చెప్పలేం. కానీ 2017 లో ‘సుచి లీక్స్’ అనే ట్యాగ్ తో ఈమె చాలా మంది సెలబ్రిటీల పడకభాగోతాలకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది.

అందులో అనిరుధ్ (Anirudh Ravichander) – ఆండ్రియా (Andrea Jeremiah) ..ల ప్రైవేట్ వీడియోతో పాటు.. రానా (Rana) – త్రిష (Trisha) , రేష్మ పసుపులేటి (Reshma Pasupuleti) వంటి సెలబ్రిటీల ప్రైవేట్ పిక్స్, వీడియోస్ ఉన్నాయి. కొద్దిరోజుల తర్వాత సుచిత్ర.. తన ట్విట్టర్ అకౌంట్ ఎవరు హ్యాక్ చేసారని చెప్పింది. కానీ అప్పటికే ఆ వీడియోస్ అన్నీ తెగ వైరల్ అయిపోయాయి. ఇదిలా ఉండగా.. చాలా కాలం తర్వాత సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె తమిళ స్టార్ హీరో ధనుష్ పై సంచలన కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ. “ధనుష్ (Dhanush) ఒక ‘గే’..! తెల్లవారుజామున 3 గంటల వరకు మగవాళ్ళతో పార్టీలు చేసుకుని ఇంటికి వచ్చేవాడితో ఎవరు కాపురం చేస్తారు.? అతను స్వలింగ సంపర్కుడు కాబట్టే ఐశ్వర్య (Aishwarya Rajinikanth) అతనికి విడాకులు ఇచ్చింది. దాంపత్య జీవితంలో ధనుష్ దంపతులు ఎఫైర్లు పెట్టుకుని చాలా తప్పులు చేశారు.

డ్రగ్స్ కి కూడా ధనుష్ భానిసైపోవడంతో ఐశ్వర్య అతన్ని భరించలేకపోయింది” అంటూ సంచలన కామెంట్స్ చేసింది సుచిత్ర. ఈ క్రమంలో సుచిత్రకి ‘మతిస్థిమితం లేదు’ అంటూ గతంలో ఆమె భర్త చేసిన కామెంట్స్ ని గుర్తు చేస్తూ తీవ్రంగా మండిపడుతున్నారు ధనుష్ అభిమానులు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus