పల్సర్ బైక్ పాట ఎంతలా ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఏ ఫంక్షన్ చూసినా ఏ పెళ్లి వేడుకలో చూసిన ఈ పాట తప్పనిసరిగా మనకు వినపడుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఈ పాటను రవితేజ హీరోగా నటించే ధమాకా సినిమాలో పెట్టడంతో మరింత ఫేమస్ అయ్యింది. ఇక ఈ పాట పాడటంతో సింగర్ రమణ కూడా మరింత ఫేమస్ అయ్యారు. ఇలా సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రమణ ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.
కుందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసినదే. జనవరి 3 వ తేది వీరి వివాహం జరిగింది. ఇకపోతే తాజాగా తన భార్య కుందనతో రమణ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుందన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరిది ప్రేమ వివాహమే. ఇద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే తన కుటుంబ సభ్యులు మొదట్లో తమ ప్రేమను అంగీకరించలేదని
ఈయన ఆర్టిస్ట్ కావడంతో మా పెళ్లికి ఒప్పుకోకపోవడమే కాకుండా మా వాళ్ళు (Ramana) తనని ఘోరంగా అవమానించారని కుందన తెలిపారు. ఇలా నా కారణంగా ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు అంటూ కుందన ఈ సందర్భంగా రమణ గురించి ఎమోషనల్ కామెంట్ చేయగా ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!