You Can Imagine అంటూ గత రెండ్రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ సోషల్ మీడియాలో సందడి చేసింది. అది ఆర్సీ 17 సినిమా గురించే అని అర్థమైపోయింది. You Can Imagine అనే ప్రచారంలో ఓ సైడ్ నుండి నెమలి పింఛం కనిపించింది. ఇదేం డిజైన్ అని అందరూ అనుకున్నారు. దీనికి సమాధానం ఇస్తూ.. సినిమా లాంఛనంగా ప్రారంభించిన తర్వాత ఓ పోస్టర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇంకొన్ని క్లారిటీలు రావాల్సి ఉంది.
#RC17 అంటూ ఇన్ని రోజులూ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు టీమ్ కొత్త వర్కింగ్ టైటిల్ పెట్టింది. అదే #RC2Sukku. ఇకపై ఈ సినిమాను అదే పేరుతో పిలవాలి ఏమో. ఇక చెప్పని అంశాలు ఏంటా అని చూస్తే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది చెప్పలేదు. సారా అర్జున్, సాత్విక వీరవల్లి, భాగ్యశ్రీ భోర్సే లాంటి పేర్లు చర్చలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురితో రామ్‌చరణ్ ఫొటో షూట్ జరిగింది అని చెబుతున్నారు.
ఇక మరో క్లారిటీ కావల్సిన విషయం సంగీత దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో భాగం కారు అని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ లేదా శాశ్వత్ సచ్‌దేవ్‌లో ఒకరు మ్యూజిక్ డైరక్టర్ అవుతారు అని చెబుతున్నారు. మరి మన లెక్కల మాస్టార్ ఏమనుకుంటున్నారో చూడాలి. ఇక కాన్సెప్ట్ పోస్టర్ సంగతి చూస్తే.. కృష్ణుడి రిఫరెన్స్ తీసుకున్నారు. నెమలి పింఛం వెనుక చరణ్ ముఖం కనిపించేలా పోస్టర్‌ను తీర్చిదిద్దారు.
మరి, ఈ సినిమాలో చరణ్ నిజంగానే కృష్ణుడుగా కనిపిస్తాడా? లేక పాత్ర చిత్రణ అలా ఉంటుందా? అనేది చూడాలి. ఎందుకంటే ఈ సినిమా డివోషనల్ అయి ఉండదు. అలా కాకపోతే రామ్ చరణ్ బృందావనంలో కృష్ణుడిలా కనిపిస్తాడా? లేక కురుక్షేత్రంలో కృష్ణుడా అనే లెక్క కూడా సుకుమార్ తేల్చలేదు. చూద్దాం పోను పోను వివరాలేమైనా బయటకు వస్తాయేమో. ఆఖరిగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు అనేది కూడా చెప్పలేదు.