Raashi Khanna: ఆ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు రాశీఖన్నాకు ఛాన్స్ ఇస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో రాశీఖన్నా ఒకరు కాగా జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, రామ్, మరి కొందరు స్టార్ హీరోలకు జోడీగా రాశీఖన్నా నటించినా ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీకి సరైన ఆఫర్లు రావడం లేదు. అయితే ఈ బ్యూటీ మాత్రం మహేష్ బాబు, బన్నీలకు జోడీగా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. థాంక్యూ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో రాశీఖన్నా కెరీర్ పై ఆ ప్రభావం పడింది.

మహేష్, బన్నీ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఆ హీరోలు ఈ బ్యూటీకి ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్ల పాత్రలు ఉంటే రాశీఖన్నాకు ఛాన్స్ ఇవ్వడం ఈ స్టార్ హీరోలకు కష్టమేమీ కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి నెలలో రాశీఖన్నా నటించిన యోధ సినిమా రిలీజ్ అవుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లకు రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలో ఆ సినిమాలకు సంబంధించిన ప్రకటనలు అయితే రానున్నాయని సమాచారం అందుతోంది. రాశీఖన్నా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే రాశీఖన్నా కెరీర్ మరింత పుంజుకుంటుందని చెప్పవచ్చు. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన రాశీఖన్నా ప్రస్తుతం స్లిమ్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

2024 సంవత్సరం రాశీఖన్నాకు (Raashi Khanna) మరింత కలిసిరావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో రాశీఖన్నా తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాశీఖన్నా సోషల్ మీడియాపై కూడా దృష్టి పెట్టాలని రొటీన్ సినిమాలకు, ప్రాధాన్యత లేని పాత్రలు ఉన్న సినిమాలకు దూరంగా ఉండాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus