‘రాధే శ్యామ్‌’ ప్రీ టీజర్‌ లీక్‌

  • February 6, 2021 / 03:29 PM IST

మొన్నామధ్య ‘సలార్‌’ షూటింగ్‌ మొదలైనప్పుడు కొన్ని ఫొటోలు లీక్‌ అయ్యాయి గుర్తుందా. గోదావరిఖనిలోని బొగ్గు గనుల్లో ప్రభాస్‌ మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అప్పుడే ఆ ఫొటోలు వచ్చాయి. కొన్ని వీడియోలు కూడా లీక్‌ అయ్యాయి. వాటిని సోషల్‌ మీడియాలో అభిమానులు షేర్‌ చేస్తూ, రీట్వీట్లు చేశారు. అయితే వాటి కింద కామెంట్లు చూస్తే… ‘సలార్‌’ సీన్స్‌ లీక్‌ ఎందుకు బ్రదర్‌… ‘రాధే శ్యామ్‌’ లీక్‌ చేసేయండి ఓ పనైపోతుంది అనే కామెంట్లు కనిపించాయి. అందుకు తగ్గట్టే ‘రాధే శ్యామ్‌’ ప్రీ టీజర్‌ లీక్‌ అయిపోయింది.

‘‘రాధే శ్యామ్‌’ ప్రీ టీజర్‌ రిలీజ్‌ చేస్తాం’ అంటూ ఎలాంటి ఊరింపులు, పోస్ట్‌లు లేకుండా ఈ రోజు రిలీజ్‌ చేసేశారు. హడావుడి లేకుండా ప్రీ టీజర్‌ రావడానికి కారణం… ఆ వీడియో అర్ధరాత్రి లీక్‌ అయిపోవడమే. ప్రీ టీజర్‌లోని మెయిన్‌ పార్ట్‌ రాత్రెప్పుడో లీక్‌ అయిపోయింది. దీంతో ఈ రోజు ఉదయాన్నే ప్రీ టీజర్‌ను బయటకు వదిలేశారు. ఈ సినిమాకు కూడా లీకుల బెడద చాలా రోజుల నుంచి ఉంది. ఇప్పుడు మరోసారి ప్రీ టీజర్‌ రూపంలో బయటపడింది. దీంతో చిత్రబృందం తలలుపట్టుకుంటోంది.

సినిమా రిలీజ్‌ విషయంలో అభిమానులు చాలా రోజుల నుంచి గుస్సాగా ఉన్నారు. సరైన అప్‌డేట్స్‌ లేకపోవడం ఒక కారణమైతే, సినిమా విడుదల విషయంలో చాలా రోజుల నుంచి సమాచారం లేకపోవడం. సినిమా రీషూట్‌లు అవుతున్నాయంటూ వార్తలు రావడమూ ఓ కారణం. ‘సాహో’ సరైన ఫలితం ఇవ్వని నేపథ్యంలో ఈ సినిమాతో అయినా ప్రభాస్‌ మళ్లీ సూపర్‌హిట్‌ ట్రాక్‌ ఎక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus