‘గరివిడి లక్ష్మి’ సినిమా ఇటీవల రిలీజ్ అయింది. ‘జైలర్ 2’, ‘రణబాలి’ వంటి పెద్ద సినిమాల భారీ పోటీ నడుమ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే సాధిస్తోంది. ఈ సినిమా హీరో, హీరోయిన్ల కెరీర్‌కి మంచి బూస్టప్ అందించిందని చెప్పాలి. ముఖ్యంగా రాగ్ మయూర్ కెరీర్‌కి! ‘మెంటల్ మదిలో’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన రాగ్ మయూర్ (Rag Mayur).. ఆ తర్వాత ‘సినిమా బండి’, ‘కీడా కోలా’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఆ తర్వాత ‘వీరాంజనేయులు విహారయాత్ర’ ‘గాంధీ తాత చెట్టు’ ‘శుభం’ ‘పరదా’ వంటి ప్రామిసింగ్ సినిమాల్లో కూడా నటించాడు. కానీ ఏదో లోటు. లీడ్ యాక్టర్‌గా కూడా మంచి పేరు సంపాదించుకోవాలని..! దాని కోసం రాగ్ మయూర్ కొంచెం ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చింది. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా అతను తగ్గలేదు. ఫైనల్‌గా ‘గరివిడి లక్ష్మి’ సినిమాతో తన లక్ష్యాన్ని ఛేదించాడు. ఈ సినిమాలో రాగ్ మయూర్ లీడ్ యాక్టర్‌గా చేశాడు. సత్తిబాబు పాత్రలో జీవించాడనే చెప్పాలి.
5 రకాల షేడ్స్ కలిగిన పాత్రను ఎంతో ఈజ్‌తో క్యారీ చేశాడు. అచ్చమైన శ్రీకాకుళం యాసలో అతను చెప్పే డైలాగులు చూస్తుంటే, తనను తాను ఎంతలా మలుచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. అలాగే వయసుకు తగ్గట్లుగా హావభావాలు, నడక, మాటతీరులో వేరియేషన్ చూపించడం అంత ఈజీయేమీ కాదు. యువకుడిగా ఉన్నప్పటి చురుకుదనం నుండి, వయసు పెరిగేకొద్దీ వచ్చే నెమ్మదితనం వరకు తన బాడీ లాంగ్వేజ్‌లో చాలా వేరియేషన్స్ చూపించి ఔరా అనిపించాడు రాగ్ మయూర్.
కేవలం మేకప్‌పై ఆధారపడకుండా ఆ పాత్రను ఓన్ చేసుకోవడం వల్లే సత్తిబాబు పాత్ర అంత సహజంగా పండిందని చెప్పాలి.రవితేజలోని ఎనర్జీ, కమల్ హాసన్ లాంటి ట్రాన్స్ఫర్మేషన్, నటనా వైవిధ్యం.. ఈ లక్షణాలన్నీ రాగ్ మయూర్లో పుష్కలంగా ఉన్నాయి. రాగ్ మయూర్‌ను దర్శకనిర్మాతలు కరెక్ట్‌గా వాడుకోవాలే కానీ, తెరపై ఎన్నో అద్భుతాలు సృష్టించగలడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.