రుత్విక్, విశాఖ ధీమన్ హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన యూత్‌ఫుల్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘రాజా ది రాజా'(Raja The Raja). అనిల్ బోయిడపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘వృందావన్ క్రియేషన్స్’ బ్యానర్‌పై కె.నిహారికా దాసరి నిర్మించగా కె.శ్రీలతా రెడ్డి సమర్పకులుగా వ్యవహరించారు.ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన టీజర్ వంటి వాటికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.తాజాగా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసి ఓ పోస్టర్ ను వదిలింది ‘రాజా ది రాజా’ యూనిట్.
జూలై 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘మైత్రీ’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. నిర్మాణ రంగంలోనూ, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది ‘మైత్రి’ సంస్థ. ‘రాజా ది రాజా’ ని అలాంటి సంస్థ రిలీజ్ చేస్తుంది అంటే.. కచ్చితంగా సినిమాలో మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకం కూడా ఆడియన్స్ లో ఏర్పడింది.టీజర్ ను యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా కట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక రిలీజ్ డేట్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీని, వాళ్ళ లవ్ జర్నీని హైలెట్ చేశారు. విజువల్స్ రిచ్ గా ఉంటాయనే భరోసా కనిపించింది ఈ రిలీజ్ డేట్ పోస్టర్. ‘దండోరా’ ఫేమ్ మార్క్ కె రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రవికిరణ్ బోయిడపు సినిమాటోగ్రఫర్ కాగా విజయ్ కుమార్ పసుపులేటి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
సినిమాలో సాయికుమార్, డాక్టర్ నరేష్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓఐ, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, భద్రం, ఆనంద్ వంటి స్టార్లు కూడా అత్యంత కీలక పాత్రలు పోషించడం విశేషంగా చెప్పుకోవాలి.