Rajamouli, Akhil: అఖిల్ ధీరకు రాజమౌళి సాయం చేస్తున్నారా.. ఏం జరిగిందంటే?

అక్కినేని అఖిల్ ఇప్పటివరకు 5 సినిమాలలో హీరోగా నటించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి. కెరీర్ పరంగా అఖిల్ తప్పటడుగులు వేస్తుండగా రాబోయే రోజుల్లో అఖిల్ కు భారీ సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే అక్కినేని అఖిల్ తర్వాత సినిమా ధీర అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు జక్కన్న స్క్రిప్ట్ వర్క్ లో సహాయం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

వైరల్ అవుతున్న వార్త గురించి అధికారికంగా క్లారిటీ లేకపోయినా ఈ వార్త నిజమైతే మాత్రం అఖిల్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల్ రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని తెలుస్తోంది. అఖిల్ గత సినిమా ఏజెంట్ ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటివరకు బుల్లితెరపై కూడా ప్రసారం కాలేదు.

రాజమౌళి అఖిల్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా అఖిల్ సినిమాకు సహాయం చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ సమ్మర్ లో మొదలుకానుండగా విదేశాల్లో ఈ సినిమాలోని ఎక్కువ సన్నివేశాలను షూట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. మహేష్ జక్కన్న ఈ సినిమాతో పాన్ వరల్డ్ రికార్డ్ లను షేక్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అఖిల్ సినిమాకు పని చేసే దర్శకుడు ఎవరనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. అఖిల్ తర్వాత సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున, అఖిల్ కాంబినేషన్ లో భారీ సినిమా రావాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అఖిల్ తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అఖిల్ (Akhil) రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus