పవన్ కళ్యాణ్ సినిమా కోసం కలిసాను.. కానీ? : రాజమౌళి

  • April 20, 2020 / 03:43 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఆయినతో సినిమాలు చెయ్యడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు. ప్రస్తుతం వేణూ శ్రీరామ్ డైరెక్షన్లో ‘వకీల్ సాబ్’ చేస్తున్న పవన్ కళ్యాణ్ .. ఆ తరువాత క్రిష్, హరీష్ శంకర్ లతో సినిమాలు చెయ్యాల్సి ఉంది. అయితే పవన్ … రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తే బాగుణ్ణు అంటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి కి కూడా ఈ ప్రశ్న ఎదురైంది. దీని పై స్పందించిన రాజమౌళి … “పవన్ కల్యాణ్ గారితో సినిమా చెయ్యాలి అని గతంలో కలిశాను. కానీ వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం ఆయిన మళ్లీ సినిమాలు చేస్తున్నారు కానీ…. ఆయన దృక్ఫథం అంతా వేరేలా ఉంది. ప్రజాసేవ… మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు.ముఖ్యంగా ప్రజా సేవకే ఎక్కువ టైం కేటాయించి…. సినిమాలకు తక్కువ సమయం ఇస్తున్నట్టు కనిపిస్తుంది.

నేనేమో సినిమాలకు ఎక్కువ టైం తీసుకుంటాను. దాంతో పవన్‌ కళ్యాణ్ గారితో సినిమా చేసే అవకాశం లేదు. సమాజం పట్ట బాధ్యత కానీ, సమాజానికి ఏదైనా చేయాలన్న కసిగానీ ఆయనకి 100 శాతం ఉంటే నాకు 0.5 మాత్రమే ఉంటుంది.. అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు.


తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus