Rajamouli: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూసిన రాజమౌళి ఏమన్నాడంటే..?:

  • September 8, 2023 / 08:45 PM IST

నవీన్ పొలిశెట్టి, అనుష్క కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. చాలా గ్యాప్ తర్వాత ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ బాబు.పి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నిన్న అంటే సెప్టెంబర్ 7 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కొత్త కథ కాకపోయినా డైరెక్షన్ చాలా బాగుందని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా అనుష్క వంటి స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ నవీన్ పోలిశెట్టి చాలా గొప్పగా నటించాడని..

ఇలాంటి లైట్ వెయిట్ కథని కూడా తన భుజాల పై మోయగలడు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడని అంతా అభిప్రాయపడ్డారు. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన దర్శకుడు (Rajamouli) రాజమౌళి తన అభిప్రాయాన్ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ” స్వీటీ అనుష్క ఎప్పటిలాగే అందంగా తెరపై మెరిసింది. నవీన్ పోలిశెట్టి తన నటనతో ఫన్ క్రియేట్ చేసి నవ్వులు పూయించాడు.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో సక్సెస్ అందుకున్న టీమ్ మెంబర్స్ అందరికీ నా అభినందనలు. సెన్సిటివ్ అంశాన్ని నేపథ్యంగా ఎంపిక చేసుకుని ఇంత ఫన్ తో నడిపించడం అంటే మాటలు కాదు.” అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా బుకింగ్స్ రెండో రోజు చాలా బాగున్నాయి. కొన్ని ఏరియాల్లో మొదటి రోజు కంటే ఎక్కువ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus