Rajamouli: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం రాజమౌళి మరో స్టంట్‌!

  • July 15, 2021 / 03:59 PM IST

రాజమౌళి సినిమా ఎంత భారీగా ఉంటుందో, ఆయన సినిమా ప్రమోషన్‌ అంత వెరైటీగా ఉంటుంది. ‘బాహుబలి’ సినిమా సమయంలో మనం దీనిని చూశాం. బాలీవుడ్‌ సినిమాల ప్రచారానికి ఏమాత్రం తీసిపోకుండా తన సినిమాల ప్రచారాన్ని నిర్వహిస్తుంటారు జక్కన్న. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారని తెలిసింది. ఈ నెల 15 నుండి సినిమా ప్రచారాన్ని ప్రారంభించనున్నారనే విషయం తెలిసిందే.

రాజమౌళి అంటే టాలీవుడ్‌లో హీరోలందరికీ అభిమానమే. ఆయనతో సినిమాలు చేసిన హీరోలు అయితే ‘జక్కన్న’ప్రేమగా ఉంటారు. ఈ క్రమంలో జక్కన్న కూడా అందరివాడిగానే ఉంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఆ స్నేహం మరోసారి కనిపించబోతోందట. సినిమా ప్రచారం కోసం తన హీరోలందరినీ ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారట. వారితో సినిమా కోసం ఓ ప్రచార గీతం రూపొందిస్తారని సమాచారం.

రాజమౌళి హీరోలు అంతా ఒక ఫ్రేమ్‌లో కనిపించడం మనం గతంలోనూ చూశాం. ‘మర్యాద రామన్న’ ఓపెనింగ్‌ అప్పుడు, సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లోనూ కలిసి వచ్చి సందడి చేశారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఇతర హీరోల బ్యాకప్‌ అవసరమా అనేది మరో ప్రశ్న. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ లాంటి హీరోలు సినిమాలో ఉన్నప్పుడు మిగిలిన హీరోలు వచ్చి సినిమాను ప్రమోట్‌ చేయాలా అనే ఆ ప్రశ్న.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus