Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలనే తన మనసులోని కోరికను మరోసారి బయటపెట్టారు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జపనీస్ యానిమేషన్, కొరియన్ ‘కె-పాప్’ తరహాలో ఇండియన్ సినిమాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా డెమోన్ స్లేయర్ వంటి యానిమేషన్ చిత్రాలు భారతదేశంలో కూడా భారీ విజయం సాధించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. అదే విధంగా మన కథలు, మన భావోద్వేగాలు కూడా అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఆయన నమ్మకం.

Rajamouli

ఈ ఆలోచనలకు బలమైన ఉదాహరణగా RRR నిలిచిందని జక్కన్న పేర్కొన్నారు. విడుదలకు ముందు వరకు ప్రాంతీయ సినిమా అని భావించిన చాలా మంది, విడుదలయ్యాక మాత్రం దీన్ని గ్లోబల్ ఈవెంట్‌లా స్వీకరించారు. భారీ బడ్జెట్, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్, భావోద్వేగాలతో నిండిన కథనం. ఇవన్నీ కలిసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. అంతకుముందే ‘బాహుబలి’ సిరీస్‌తో రాజమౌళి భారతీయ సినిమాకు కొత్త మార్కెట్లను తెరిచారు. దేశవ్యాప్తంగా కాదు, విదేశాల్లోనూ థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఈ విజయాలు కేవలం వసూళ్ల పరంగా మాత్రమే కాదు, భారతీయ సినిమాపై ప్రపంచ దృష్టిని మళ్లించడంలోనూ కీలక పాత్ర పోషించాయి. భాష,ప్రాంతం అనే గడులు చెరిపేసి, కథ బలంగా ఉంటే అది ఎక్కడైనా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని రాజమౌళి సినిమాలు మరోసారి రుజువు చేస్తున్నాయి. భారతీయ సినిమా భవిష్యత్తుపై జక్కన్న కలలు ఇప్పుడిప్పుడే నిజమవుతున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus