The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. దాని ఫలితం అందరికీ తెలిసిందే. సినిమా ఆడలేదు కానీ.. దర్శకుడు మారుతి పై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ అలాగే అతని ఇంటికి కొంతమంది ప్రభాస్ అభిమానులు పెట్టిన ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఆర్డర్ల గురించి అంతా కథలు కథలుగా చెప్పుకున్నారు. ప్రభాస్ కి ఉన్న స్టార్ డమ్ కారణంగా ‘ది రాజాసాబ్’ కి మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి.

The RajaSaab 

కానీ బ్యాడ్ టాక్ వల్ల బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ కి భారీ నష్టాలే మిగిల్చింది ‘ది రాజాసాబ్’. అయితే ప్రభాస్.. ఆయనకి అండగా నిలబడి ‘స్పిరిట్’ హక్కులతో పాటు మరో సినిమా చేసి పెడతాను అని మాట ఇచ్చారు. మరోవైపు విశ్వప్రసాద్ కూడా ‘ది రాజాసాబ్’ పేరు చెప్పుకుని.. ఆయన నిర్మించిన చాలా సినిమాల ఓటీటీ రైట్స్ ని, ధియేట్రికల్ రైట్స్ ని బాగానే సేల్ చేసుకున్నారు.

అలాగే ఆ సినిమా పేరు చెప్పుకుని మీడియాలో కూడా తన మిగిలిన సినిమాలని బాగానే ప్రమోట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ‘ది రాజాసాబ్’ పేరు చెప్పుకుని అదే బ్యానర్లో రూపొందుతోన్న ‘గరివిడి లక్ష్మీ’ కి అన్యాయం చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. అవును ‘రాజాసాబ్’ కి నష్టాలు వచ్చాయని చెప్పి ప్రొడక్షన్లో ఉన్న ‘గరివిడి లక్ష్మీ’ బడ్జెట్లో కోతలు విధించారట టి.జి.విశ్వప్రసాద్. అది మేటర్.

పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus