Rajasekhar: ‘ఎక్స్ట్రా’ .. రాజశేఖర్ మెయిన్ విలన్ కాదా?

  • November 1, 2023 / 10:44 PM IST

నితిన్ హీరోగా ‘ఎక్స్ట్రా’ అనే సినిమా రూపొందుతుంది. ‘నా పేరు సూర్య’ తర్వాత వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. డిసెంబర్ 8న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల అంటే అక్టోబర్ 30 న విడుదలయ్యింది. దీనికి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో నితిన్ ఓ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నాడు అని ఈ టీజర్ తో తెలియజేశారు.

తర్వాత అతను పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు అనే టాక్ కూడా బయటకి వచ్చింది. అది నిజమో కాదో తెలీదు. అది పక్కన పెట్టేస్తే.. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతని పాత్రకి సంబంధించిన ఎటువంటి లీడ్… టీజర్ ద్వారా ఇచ్చింది లేదు. అయితే రాజశేఖర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి.. అది విలన్ పాత్రే అని అంతా అనుకున్నారు. కానీ అందులో నిజం లేదు అని వినికిడి.

అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఎక్స్ట్రా’ లో (Rajasekhar) రాజశేఖర్ ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. హీరోకి సాయం చేసే పాత్ర లాంటిది ఇది. ఇంకో రకంగా హీరోలో స్ఫూర్తి నింపే పాత్ర లాంటిది అనుకోవచ్చు. ఇలాంటి పాత్ర చేయడానికి చాలా మంది ఉన్నారు.. రాజశేఖరే చేయాలా అనే కామెంట్స్ కూడా ఇండస్ట్రీ సర్కిల్స్ నుండీ వినిపిస్తున్నాయి. కానీ సినిమా చూడకుండా ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అని కొందరి అభిప్రాయం..!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus