Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Advertisement

‘కమల్‌ హాసన్‌ – రజనీకాంత్‌’ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తే బాగుండు అని చాలా ఏళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి తొలి మెట్టుగా రజనీకాంత్‌ హీరోగా కమల్‌ హాసన్‌ నిర్మాతగా ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. రజనీకాంత్‌ 173వ సినిమాగా ఇది రూపొందుతోంది. ఇప్పటికే ఓ దర్శకుడి మారిన ఈ ప్రాజెక్ట్‌కు మరో దర్శకుడు కూడా మారారు అని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ దాదాపుగా వచ్చేసింది. అవును దర్శకుడు మరోసారి మారారట.

Thalaivar 173

కమల్‌ హాసన్‌ నిర్మాణంలో రజనీ కాంత్‌ హీరోగా అనౌన్స్‌ అయిన సినిమాకు తొలుత సీనియర్‌ దర్శకుడు సుందర్‌.సి దర్శకత్వం వహిస్తారని అనౌన్స్‌ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రాజెక్ట్‌ నుండి ఆయన తప్పుకున్నారు. ఏమైంది అనే వివరాలు చెప్పలేదు కానీ కథ విషయంలో మార్పులు చేర్పులే కారణమని తెలిసింది. ఆ సమయంలో ‘డాన్‌’ సినిమా ఫేమ్‌ సిబి చక్రవర్తి ఫ్రేమ్‌లోకి వచ్చారు. ఆయన కథ నచ్చిందని, త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్‌ అని అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు.

ఆ సమయంలో ఓ ఈవెంట్‌కి సిబి వెళ్తే అక్కడ హీరో శివకార్తికేయన్‌ ‘రజనీకాంత్ డైరక్టర్‌’ అంటూ హడావుడి కూడా చేశాడు. అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం సిబి సిద్ధం చేసిన పూర్తి స్క్రిప్ట్‌కి రజనీ – కమల్ ఓకే చెప్పలేదట. అంతేకాదు తమ సినిమాకు వేరే దర్శకుడిని చూద్దాం అని అనుకున్నారట. ఈ క్రమంలో గతంలో ఇదే ప్రాజెక్ట్‌ కోసం పని చేసిన అశ్వత్‌ మరిముత్తుకు పిలుపు వచ్చిందట. ఆయన చెప్పిన కథకు ఓకే చెప్పారట. త్వరలో కొబ్బరికాయ కొడతారని లేటెస్ట్‌ మాట.

గతంలో తానొక కథను రజనీ, కమల్‌కి వినిపించానని.. కానీ ముందుకు వెళ్లలేదు అని ఇటీవలే అశ్వత్‌ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనకే ఈ ప్రాజెక్ట్‌ దక్కింది. అన్నట్లు ఈ సినిమా కోసం చెన్నైలోని పూనమల్లి ప్రాంతంలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ పనులు పూర్తి కాగానే షూటింగ్‌ స్టార్ట్ అయ్యే అవకాశముందంటున్నారు.

కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus