విజయ్ దేవరకొండ- రష్మిక మందన..ల వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్లో జరగబోతున్న సంగతి తెలిసిందే. తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. ఇక వీరి వీరి వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో వీళ్ళ ఆస్తుల గురించి కూడా కొంతమంది ఆరా తీయడం మొదలుపెట్టారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక..ల నికర ఆస్తి విలువ రూ. 136 కోట్లు అని అంచనా. ఇందులో విజయ్ దేవరకొండ ఆస్తి విలువ దాదాపు రూ. 70 కోట్లు అని అంటున్నారు. సినిమాలకి వచ్చే పారితోషికంతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు (రౌడీ వేర్ వంటివి) అలాగే ఇంకా పలు యాడ్స్ రూపంలో వచ్చిన సంపాదన అంత మొత్తం ఉంటుంది అని తెలుస్తోంది.
హైదరాబాద్, జూబ్లీహిల్స్ పరిసరాల్లో విజయ్ దేవరకొండకి ఒక ఖరీదైన బంగ్లా ఉంది.దాని విలువ దాదాపు రూ. 15 కోట్లు అంటున్నారు.ఇంకా ఎక్కువ కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఒక్క ‘కింగ్డమ్’ కోసమే విజయ్ రూ.27 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు. దానికి ముందు వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ కి రూ.20 కోట్లు అందుకున్నాడు. ‘ఖుషి’ కి కూడా రూ.15 కోట్లు అందుకున్నట్టు టాక్ ఉంది.
అలాగే ‘లైగర్’ కి రూ.8 కోట్లు(రూ.12 కోట్లు వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది) అని తెలుస్తుంది. సో విజయ్ ఆస్తులు రూ.70 కోట్ల నుండి రూ.80 కోట్ల వరకు ఈజీగా ఉండొచ్చు.మరోవైపు రష్మిక ఆస్తుల విలువ కూడా రూ.66 కోట్ల వరకు ఉంటుంది అని అంచనా. అలాగే కర్ణాటకలోని విరాజ్‌పేటలో రష్మిక ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసింది. దాని విలువ సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని టాక్.
ఇది కేవలం రష్మిక సొంతంగా సినిమాలు, యాడ్స్ రూపంలో సంపాదించిన మొత్తం. ఆమె తండ్రి కూడా పెద్ద బిజినెస్మెన్ అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే.